Amoolya Rakthamu Dwaaraa | Telugu Christian song lyrics

Amoolya Rakthamu Dwaaraa song lyrics In Telugu And English

తెలుగు
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము

మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2)
చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2) ||అమూల్య||

చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2)
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2) ||అమూల్య||

నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2)
స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2) ||అమూల్య||

కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2)
ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2) ||అమూల్య||

తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2)
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2) ||అమూల్య||

పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2)
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2) ||అమూల్య||

మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2)
మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2) ||అమూల్య||
 
English
Amoolya Rakthamu Dwaaraa Rakshana Pondina Janulaaraa
Sarva Shakthuni Prajalaaraa Parishudhdhulaaraa Paadedamu
Ghanatha Mahima Sthuthulanu Parishudhdhulaaraa Paadedamu

Mana Yavvana Jeevithamul – Shareeraashaku Lobarachi (2)
Chedu Maatalanu Palukuchu – Shaanthi Leka Yuntimigaa (2) ||Amoolya||

Chedu Maargamuna Pothimi – Daani Yanthamu Maranamu (2)
Naraka Shikshaku Lobaduchu – Paapapu Dhanamu Pondithimi (2) ||Amoolya||

Nithya Sathya Devuni – Naamamuna Moralidaka (2)
Swantha Neethi Thodane – Devuni Raajyamu Korithimi (2) ||Amoolya||

Kanikaramugala Devudu – Maanavaroopamu Daalchenu (2)
Praanamu Siluvanu Balijesi – Manala Vimochinchenu (2) ||Amoolya||

Thana Raktha Dhaaralalo – Mana Paapamulanu Kadigi (2)
Mana Kannulanu Therachi – Manala Nimpenu Gnaanamutho (2) ||Amoolya||

Paapulamaina Mana Meeda – Thana Yaascharya Ghana Prema (2)
Kummarinchenu Mana Prabhuvu – Kruthagnatha Chellinthumu (2) ||Amoolya||

Mana Rakshakuni Sthuthinchedamu – Manalanu Jesenu Dhanyulugaa (2)
Mana Devuni Karpinchedamu – Jeevaathma Shareeramulan (2) ||Amoolya||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top